Chiru@42 - చిరంజీవి ప్రాణం పోసుకున్న రోజు

Tuesday,September 22,2020 - 02:11 by Z_CLU

కొణెదల శివశంకర వరప్రసాద్ పుట్టి 65 ఏళ్లవుతోంది. కానీ వెండితెరపై చిరంజీవి పుట్టి ఈరోజుకు (September 22) సరిగ్గా 42 ఏళ్లు అవుతుంది. అవును.. చిరంజీవి తొలి సినిమా ప్రాణం ఖరీదు (Pranam Khareedu) రిలీజై నేటికి సరిగ్గా 42 ఏళ్లవుతోంది. ఈ మెమొరబుల్ మూమెంట్ ను ఫ్యాన్స్ తో పాటు చిరంజీవి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

చిరంజీవి అంగీకరించి, మొదలుపెట్టిన తొలి సినిమా పునాదిరాళ్లు. కానీ ఆయన కెరీర్ లో విడుదలైన మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు. 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది ఈ సినిమా. అలా ఇవాళ్టికి 42 ఏళ్ల సినీప్రయాణాన్ని పూర్తిచేసుకున్నారు మెగాస్టార్.

కె.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయసుధ, రావుగోపాలరావు, చంద్రమోహన్‌, చిరంజీవి, రేష్మా రాయ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో చిరంజీవిది ముఖ్యమైన పాత్ర. పల్లెటూరి యువకుడిగా చిరు కనిపించారు.

తన 42 ఏళ్లు సుదీర్ఘ సినీచరిత్రలో ఇప్పటివరకు 151 సినిమాలు చేశారు Chiranjeevi. ప్రస్తుతం తన 152వ చిత్రంగా ఆచార్య మూవీ చేస్తున్నారు. అంతేకాదు.. 153, 154, 155 చిత్రాల్ని కూడా లైన్లో పెట్టారు.