Lucifer launch - మెగా మూవీ ప్రారంభం

Wednesday,January 20,2021 - 05:42 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మించనున్న మెగాస్టార్ 153వ చిత్రం బుధవారం ఉదయం ఫిలిం నగర్ సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ మెగా ఈవెంట్ లో అల్లు అరవింద్, అశ్విని దత్, డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు తమన్, మెగా బ్రదర్ నాగబాబు, కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, బాబీ, రామ్ ఆచంట, గోపి ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, శిరీష్ రెడ్డి, యూ వి క్రియేషన్స్ విక్కీ తదితరులు పాల్గొన్నారు.

Chiranjeevi Lucifer Remake Launch 2

లూసిఫర్ రీమేక్ రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి నుండి ఉంటుంది. తెలుగు నేటివిటీ, చిరు ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా స్క్రిప్టులో మోహ‌న్ రాజా మార్పులు చేశాడు. అందుకే దీన్ని పూర్తిస్థాయి రీమేక్ గా చెప్పడం లేదు. కేవలం కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చి తెరకెక్కిస్తారు.

టెక్నీషియన్స్

సంగీతం : ఎస్ ఎస్ తమన్

కెమెరా : నీరవ్ షా

రచయిత : లక్ష్మి భూపాల్

ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్

లైన్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావు.

నిర్మాతలు : ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్,

బ్యానర్లు : కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్

స్క్రీన్ ప్లే – దర్శకత్వం : మోహన్ రాజా