Bholaa Shankar - ఫస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

Tuesday,November 16,2021 - 05:20 by Z_CLU

Chiranjeevi’s Bholaa Shankar regular shoot Begins In Hyderabad

మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఘనంగా  నిర్వహించారు.

తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. AS ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి మీద ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

భోళా శంకర్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. టైటిల్ పోస్టర్, రాఖీ పండుగ నాడు విడుదల చేసిన స్పెషల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవిని మెహర్ రమేష్ విభిన్న గెటప్స్‌లో చూపించబోతోన్నారు.

– భోళాశంకర్ ఓపెనింగ్ లో మిల్కీబ్యూటీ

అద్భుతమైన కథకు.. మరింత అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం తోడైంది. చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. కీర్తి సురేష్ ఆయన చెల్లిగా కనిపించనున్నారు. పక్కా కమర్షియల్‌గా ఈ చిత్రం ఉండబోతోంది.

యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

chiranjeevi Bhola Shankar movie launch opening stills

భోళా శంకర్ 2022లో థియేటర్స్ లోకి వస్తుందంటున్నారు మేకర్స్.

నటీనటులు : చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు

సాంకేతిక బృందం

డైరెక్టర్ :  మెహర్ రమేష్
నిర్మాత  : రామబ్రహ్మం సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :  కిషోర్ గరికిపాటి
డీఓపీ  : డడ్లీ
సంగీతం :  మహతి స్వర సాగర్
ఎడిటర్  : మార్తాండ్ కే వెంకటేష్
స్క్రిప్ట్ పర్యవేక్షణ  : సత్యానంద్
ఫైట్స్ :  రామ్ లక్ష్మణ్, దిలీస్ సుబ్బరాయన్, కెచ్చా
కొరియోగ్రఫర్ :  శేఖర్ మాస్టర్
లిరిక్స్ :  రామ జోగయ్య శాస్త్రి, కాస్లర్ శ్యాం, శ్రీమణి, సిరా శ్రీ
వీఎఫ్ఎక్స్ :  యుగంధర్
పబ్లిసిటీ డిజైన్  : అనిల్ భాను
పీఆర్వో :  వంశీ శేఖర్
డిజిటల్ మీడియా హెడ్ : విశ్వ సీఎం
లైన్ ప్రొడక్షన్ : మెహర్ క్రియేషన్స్
ప్రొడక్షన్ కంట్రోలర్ : అజయ్ కుమార్ వర్మ
చీఫ్ కో డైరెక్టర్ :  లలిత్ ప్రభాకర్
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్ : రామకృష్ణ రెడ్డి, రవి దుర్గా ప్రసాద్

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics