Bholaa Shankar - రేపే మెగా మూవీ ఫస్ట్ లుక్

Monday,February 28,2022 - 12:35 by Z_CLU

Chiranjeevi’s Bholaa Shankar First Look On March 1st For Maha Shivarathri

మెగాస్టార్ చిరంజీవి మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోలా శంకర్”. ఈ యాక్షన్ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలు ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

స్వాగ్ ఆఫ్ భోలా పేరుతో ఈ చిత్రం ప్రీ-లుక్‌ను మేకర్స్ ఇటీవలే విడుదల చేసారు. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, ఈ సినిమా ఫస్ట్ లుక్ సమయం వచ్చేసింది. భోలా శంకర్ ఫస్ట్ లుక్ ను మహా శివరాత్రి సందర్భంగా రేపు ఉదయం 9:05 గంటలకు విడుదల కాబోతుంది. శివునికి మరొక పేరు అయిన శంకర్ టైటిల్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నందున, ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి ఇది సరైన సమయం అని మేకర్స్ భావించారు

జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్. యువ సంచలనం మహతి స్వర సాగర్ సౌండ్‌ట్రాక్‌లను అందించగా, డుడ్లీ కెమెరా భాధ్యతలు నిర్వహిస్తున్నారు.

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాదిలోనే భోళా శంకర్ థియేటర్లలోకి వస్తున్నాడు. రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics