Acharya Teaser - రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,January 27,2021 - 12:00 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. ఇప్పుడీ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఎల్లుండి (29న) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఆచార్య టీజర్ రాబోతోంది.

టీజర్ ఎనౌన్స్ మెంట్ లో భాగంగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోకు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. ధర్మస్థలి తలుపులు 29 సాయంత్రం తెరుచుకుంటాయంటూ కొరటాల చేసిన ట్వీట్ చూస్తే.. సినిమాలో టెంపుల్ టౌన్ సెట్ కు (దీని పేరే ధర్మస్థలి) ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాకు సంబంధించి టెంపుల్ డౌన్ విశేషాలతో ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి. సినిమాకు అది మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవబోతోంది.

chiranjeevi-acharya-temple-set 1

కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. సినిమాలో అతడి పేరు సిద్ధ. టీజర్ లో ఆచార్య రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.