ఆచార్య కూడా ఆగిపోయింది

Sunday,March 15,2020 - 04:01 by Z_CLU

కరోనా ప్రభావం టాలీవుడ్ పై గట్టిగా పడింది. థియేటర్లు మూసేయాల్సిందిగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ అనివార్యంగా వాయిదాపడ్డాయి. కేవలం సినిమా రిలీజెస్ మాత్రమే కాదు, షూటింగ్స్ కూడా ఆగిపోతున్నాయి. ఇప్పటికే బన్నీ-సుకుమార్ సినిమా షూట్ ను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మెగాస్టార్ ఆచార్య కూడా చేరింది.

కరోనా ప్రభావంతో ఆచార్య సినిమా షూటింగ్ ను వాయిదా వేస్తున్నట్టు స్వయంగా చిరంజీవి ప్రకటించారు. తన సినిమాకు దాదాపు వంద మందికి పైగా టెక్నీషియన్స్ పనిచేస్తున్నారని, ఇంత మంది కలిసి పనిచేసే చోట కరోనా వ్యాపించే ప్రమాదం ఉండడంతో.. తమ యూనిట్ ఆరోగ్యాన్ని దృష్టిల పెట్టుకొని, ఆర్థికంగా భారమైనప్పటికీ ఆచార్య షూటింగ్ ను వాయిదా వేస్తున్నట్టు మెగాస్టార్ ఎనౌన్స్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. త్వరలోనే కొత్త హీరోయిన్ ను సెలక్ట్ చేసి, ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలనేది ప్లాన్. అంతలోనే కరోనా వల్ల షూటింగ్ వాయిదా పడింది.