#Acharya - వచ్చేదెప్పుడు?

Monday,June 21,2021 - 04:16 by Z_CLU

ఈ ఏడాది రాబోయే మెగా సినిమా #Acharya కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. సైరా తర్వాత చిన్న గ్యాప్ తో చిరు నుండి వస్తున్న సినిమా కావడం పైగా కొరటాల శివ డైరెక్షన్ లో రానున్న సినిమా అవ్వడంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు అందరు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యుల్ బ్యాలెన్స్ ఉంది. ఆ షెడ్యుల్ లో చిరు , చరణ్ మిగతా నటీ నటులపై సన్నివేశాలు తీయాల్సి ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దసరా బరిలో నిలవునుందని తెలుస్తుంది. ఇప్పటికే అక్టోబర్ రిలీజ్ అంటూ మేకర్స్ ఆ ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. నిజానికి కరోన సెకండ్ వేవ్ రాకపోయినట్టయితే సమ్మర్ లో సినిమా రిలీజ్ అయ్యేది. కానీ సమ్మర్ మిస్ అవ్వడంతో ఇప్పుడు దసరా సీజన్ లో ఈ భారీ సినిమాను భారీ థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్.

Kajal in acharya movie

‘ఆచార్య’లో కాజల్

ప్రస్తుతం తెలంగాణలో లాక్ డౌన్ లేదు కనుక అతి త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టి జెట్ స్పీడులో ఫైనల్ షెడ్యుల్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు కొరటాల అంతా రెడీ చేసుకుంటున్నారు. సోనూ సూద్ , కాజల్ తో పాటు మిగతా నటీ నటులు ఈ షెడ్యుల్ లో పాల్గొనాల్సి ఉంది. అందరి డేట్స్ కన్ఫర్మ్ చేసుకొని హైదరాబాద్ లో భారీ షెడ్యుల్ జరపనున్నారు. ఆ షెడ్యుల్ తో షూటింగ్ గుమ్మడి కాయ కొట్టేసి దసరా బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. త్వరలోనే ఓ డేట్ ఫైనల్ చేసి అఫీషియల్ గా దసరా రిలీజ్ అని చెప్పే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics