#Mega156 - చిరు లిస్టు లో గోపీచంద్ దర్శకులు?

Thursday,September 16,2021 - 03:08 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడులో సినిమాలు చేయబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆచార్య’ రిలీజ్ అవ్వకుండానే మోహన్ రాజా డైరెక్షన్ లో ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాథర్’ సినిమాను సెట్స్ పైకి పెట్టిన చిరు నెక్స్ట్ సినిమాలను కూడా ఎనౌన్స్ చేసి లైన్లో పెట్టేశాడు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో ‘భోళా శంకర్’ అనే సినిమా అలాగే బాబీ డైరెక్షన్ లో #MEGA155 సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

gopichand sampath nandi seetimaarr 2

అయితే ఈ రెండు సినిమాలే కాకుండా మరో రెండు సినిమాలు కూడా డిస్కషన్ స్టేజిలో ఉన్నాయని తెలుస్తుంది. అవును చిరు మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడని టాక్ వినబడుతుంది. ఈ కాంబో సినిమాను యూ.వీ.క్రియేషన్స్ నిర్మించనుందని అంటున్నారు. ఇప్పటికే మెగా స్టార్ కోసం ఓ మెగా స్క్రిప్ట్ రెడీ చేసి దానికి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట మారుతీ. ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న మారుతి నెక్స్ట్ సినిమా మెగా స్టార్ తోనే అట.

gopichand maruthi pakka commercial movie 2

ఇక తాజాగా గోపీచంద్ తో ‘సీటిమార్’ సినిమా తీసిన సంపత్ నంది పేరు కూడా చిరు లిస్టులో వినబడుతుంది. కెరీర్ ఆరంభంలో రామ్ చరణ్ తో ‘రచ్చ’ అనే సినిమా తీసిన సంపత్ నంది ఎప్పటి నుండో చిరు తో ఓ సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు. ఇటివలే సీటిమార్ ప్రమోషన్ లో భాగంగా చిరు ని కలిసి తన దగ్గర స్క్రిప్ట్ ఉందని చెప్పాడట సంపత్. మెగా స్టార్ త్వరలోనే డిస్కస్ చేద్దామని చెప్పి సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. మరి ఇటు మారుతి అటు సంపత్ నంది ఇద్దరి పేర్లు #Chiru156 సినిమాకు గట్టిగా వినబడుతున్నాయి. ఈ ఇద్దరిలో బాబీ సినిమా తర్వాత మెగా స్టార్ అవకాశం ఇచ్చే దర్శకుడెవరో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics