హీరోయిన్ ను రిపీట్ చేస్తున్న చిరు

Wednesday,October 02,2019 - 01:35 by Z_CLU

సైరా థియేటర్లలోకి వచ్చేసింది.. వాట్ నెక్ట్స్?
ఇంకేముంది.. కొరటాల శివ సినిమా స్టార్ట్ చేయడమే
నవంబర్ నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుందని చిరంజీవి కన్ ఫర్మ్ కూడా చేశారు. సో.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి. సినిమా కాస్ట్ అండ్ క్రూ ఎంపిక ప్రారంభమైంది.

సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే ఫిలింనగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం చిరంజీవి సరసన త్రిష నటించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి స్టాలిన్ సినిమా చేశారు. ఆ సినిమా వచ్చి 13 ఏళ్లు అవుతోంది.

ఇంతకు ముందు నయనతార, అనుష్క, శృతి హాసన్ పేర్లు వినిపించాయి…. కానీ త్రిష పేరు దాదాపు ఫిక్స్ అంటున్నారు. ఈ మేరకు కొరటాల, చెన్నై వెళ్లి త్రిషకు స్టోరీ కూడా చెప్పినట్టు టాక్. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రానుంది.