RRR Teaser - మెగా వాయిస్ ఓవర్

Monday,January 04,2021 - 01:29 by Z_CLU

మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ RRR టీజర్ రెడీ అవుతుంది. జనవరి 26న రిపబ్లిక్ డే స్పెషల్ గా చరణ్ , తారక్ ల సన్నివేశాలతో మరో టీజర్ వదలబోతున్నాడు రాజమౌళి. అయితే ఈ టీజర్ కి జక్కన్న స్పెషల్ ఎలిమెంట్ ను జోడించనున్నాడని తెలుస్తుంది. RRR కి సంబంధించి చరణ్ వర్షన్ టీజర్ కి తారక్ , ఎన్టీఆర్ వర్షన్ టీజర్ కి చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇద్దరి పాత్రలతో రానున్న రిపబ్లిక్ డే టీజర్ కి మెగా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని భావించి చిరు నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట రాజమౌళి. అవును RRR టీజర్ కి మెగా స్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని సమాచారం.

ప్రస్తుతానికి టీజర్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే దానికి మెగా వాయిస్ ను జోడించి రెడీ చేసి తారక్ , చరణ్ ఫ్యాన్స్ కి మేకర్స్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లను స్మరించుకునేలా ఈ టీజర్ రిలీజ్ చేయనున్నారట.