Chiranjeevi - మరో యంగ్ డైరక్టర్ తో మెగాస్టార్?

Monday,November 22,2021 - 02:11 by Z_CLU

Chiranjeevi Venky Kudumula Combination on Cards

చిరంజీవికి సినిమాలకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. త్వరలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారట మెగాస్టార్. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న బజ్ ఇది. డీవీవీ దానయ్య నిర్మాతగా అతి త్వరలోనే ఈ సినిమా ప్రకటన వస్తుందంటున్నారు చాలామంది.

రీసెంట్ గా యంగ్ డైరక్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్నారు చిరంజీవి. బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా పైప్ లైన్లో ఉంది. ఈ క్రమంలో వెంకీ కుడుములకు కూడా ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

పక్కా కమర్షియల్ సినిమాలకు, వినోదానికి కేరాఫ్ అడ్రస్ వెంకీ కుడుముల. అతడు తీసిన ఛలో, భీష్మ సినిమాలు ఫుల్ లెంగ్త్ వినోదాన్ని పంచాయి. చిరంజీవితో కూడా అదే ఫార్ములా సినిమా తీయబోతున్నాడట వెంకీ కుడుముల. 2023లో ఈ సినిమా పట్టాలపైకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.

నిజానికి రామ్ చరణ్ తో సినిమా అనుకున్నాడు వెంకీ కుడుముల. ఈ మేరకు చరణ్ కు కథ వినిపించినట్టు కూడా గాసిప్స్ వచ్చాయి. అంతలోనే ఆ స్టోరీ చిరంజీవి చెంతకు చేరినట్టు చెబుతున్నారు. గతంలో కొరటాల శివ విషయంలో కూడా ఇలానే జరిగింది. చరణ్ తో సినిమా ప్లాన్ చేసిన కొరటాల, ఏకంగా చిరంజీవితో ఆచార్య సినిమా తీశారు.

మొత్తమ్మీద చిరంజీవి స్పీడ్ పెంచారు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. మరే హీరో మెగాస్టార్ రేంజ్ లో సినిమాలు ఎనౌన్స్ చేయడం లేదు. ప్రస్తుతం సెట్స్ పై గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలున్నాయి. ఆచార్య విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే బాబి సినిమా మొదలవుతుంది. ఆ వెంటనే మరో 2 సినిమాల ప్రకటనలు రాబోతున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics