మరోసారి మెగాస్టార్ సరసన?

Saturday,January 19,2019 - 12:36 by Z_CLU

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా సినిమాలో నటిస్తోంది నయనతార. ఈ ముద్దుగుమ్మను మరోసారి రిపీట్ చేసే ప్రయత్నాల్లో  ఉంది మెగా కాంపౌండ్. సైరా కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చిరంజీవి. ఈ మూవీలో కూడా నయనతారనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతానికి ఈ సినిమా స్క్రిప్ట్ స్టేజ్ లో ఉంది. కథ ప్రకారం, ఓ క్యారెక్టర్ కు నయనతారను తీసుకుంటే బాగుంటుందని కొరటాల సూచించాడట. పైగా ఎక్కువ కాల్షీట్లు అవసరం పడదని, ఓ నెల రోజులు కాల్షీట్లు కేటాయిస్తే సరిపోతుందని చెప్పాడట. దీంతో చిరంజీవి ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

సైరా షూటింగ్ ను మార్చి నాటికి పూర్తిచేసి, ఏప్రిల్ నుంచి కొరటాల శివ సినిమాను స్టార్ట్ చేయాలని చిరంజీవి భావిస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఓ క్లారిటీ రానుంది.