మెగా అభిమానులకు గుడ్ న్యూస్

Tuesday,March 24,2020 - 03:39 by Z_CLU

చిరంజీవి మూవీ అప్ డేట్స్ కోసం ఇకపై అక్కడా ఇక్కడా సెర్చ్ చేయనక్కర్లేదు. చిరంజీవి పేరిట వస్తున్న వార్తల్ని, ప్రెస్ నోట్లను నమ్మాలా వద్దా అనే డౌట్స్ ఇక ఎంతమాత్రం అక్కర్లేదు. అవును.. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి వస్తున్నారు.

రేపు ఉగాది నుంచి అధికారికంగా సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నారు మెగాస్టార్. ఈ విషయాన్ని చిరంజీవి ప్రత్యేకంగా ప్రకటించారు. ఇకపై చిరుకు సంబంధించి ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఆచార్య సినిమా అప్ డేట్స్ తో పాటు అభిమానులకు ఆయనిచ్చే సందేశాన్ని, స్పెషల్ వీడియోల్ని చూడొచ్చు.

అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు మెగాస్టార్. ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంటరవ్వడంతో.. చిరంజీవికి, మెగా ఫ్యాన్స్ కు మధ్య గ్యాప్ మరింత తగ్గుతుంది. నిజంగా అభిమానులకు ఇది గుడ్ న్యూస్.