Chiranjeevi - మెగాస్టార్ కు కరోనా పాజిటివ్

Monday,November 09,2020 - 12:28 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎనౌన్స్ చేశారు. తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో తనకు పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు.

chiranjeevi corona

ఇవాళ్టి నుంచి ఆచార్య కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. ప్రోటోకాల్ ప్రకారం అందరూ కొవిడ్ టెస్టులు చేయించుకున్నారు. ఆ టెస్టుల్లో చిరంజీవికి పాజిటివ్ వచ్చింది.

ఈరోజు షెడ్యూల్ లో చిరంజీవిపైనే సీన్స్ ప్లాన్స్ చేశాడు కొరటాల. దీంతో అనివార్యంగా ఆచార్య షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది యూనిట్ త్వరలోనే వెల్లడిస్తుంది.

ప్రస్తుతం చిరంజీవికి ఎలాంటి లక్షణాల్లేవు. ఆయన హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. రీసెంట్ గా 2 పెళ్లిళ్లకు హాజరయ్యారు చిరంజీవి. ఆ తర్వాత నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ ను కలిశారు.