అమితాబ్ లుక్స్ ని రివీల్ చేసిన ‘సైరా’ టీమ్

Thursday,October 11,2018 - 12:41 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సైరా’ లో బిగ్ బి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన సెట్స్ పై ఉన్నప్పుడు కొన్ని ఫోటోస్ కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది టీమ్. అయితే ఈ రోజు ఆయన 76 వ   పుట్టిన రోజు    సెలెబ్రేట్  చేసుకుంటున్న    సందర్భంగా సినిమాలో ఆయన రోల్ ని రివీల్ చేస్తూ, మరింత పవర్ ఫుల్ గెస్చర్ తో మోషన్   పోస్టర్   రిలీజ్  చేసింది సినిమా యూనిట్.

అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో చిరంజీవికి గురువుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆయన పేరు ‘గోసాయి వెంకన్న’. సినిమాలో మోస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్ లో నటిస్తున్న బిగ్ బి లుక్స్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తున్నాయి.

బ్రిటీష్ ప్రభుత్వం నుండి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మొటమొదటి భారతీయుడు ‘నరసింహారెడ్డి’ రోల్ లో నటిస్తున్నాడు మెగాస్టార్ ఈ సినిమాలో.   ఫాస్ట్ పేజ్ లో షూటింగ్  జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ పైకి రీసెంట్ గా,  కిచ్చా సుదీప్ తో పాటు విజయ్ సేతుపతి కూడా జాయిన్ అయ్యారు. సినిమాలో వీరిద్దరివి కూడా కీ రోల్స్ అని తెలుస్తుంది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అమిత్ త్రివేది ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకుడు.