మెగాస్టార్ ‘సైరా’ సినిమా అప్డేట్స్

Tuesday,October 16,2018 - 06:04 by Z_CLU

మెగాస్టార్ ‘సైరా’ లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు కిచ్చా సుదీప్. రీసెంట్ గా జార్జియాలో జరుగుతున్న రెగ్యులర్ షూటింగ్ లో సెట్స్ పైకి వచ్చిన సుదీప్, సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. దాదాపు 500 మంది తో తెరకెక్కుతున్న ఈ వార్ సీక్వెన్సెస్ లో క్రూషల్ రోల్ ప్లే చేస్తున్నాడు సుదీప్.

ఫాస్ట్ పేజ్ లో ఈ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న ‘సైరా’ టీమ్, నెక్స్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేస్తుంది. ఈ షెడ్యూల్ కి సంబంధించిన భారీ సెట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ లెక్కన మ్యాగ్జిమం డిసెంబర్ కల్లా 90% సినిమాకి ప్యాకప్ చెప్పే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

అమితాబ్ బచ్చన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తుండగా తమన్నా, మరో ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించనుంది. అమిత్ త్రివేది ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్.