అమితాబ్ కు కూడా అదే ఫీలింగ్

Thursday,March 29,2018 - 04:36 by Z_CLU

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి క్యారెక్టర్ లో నటిస్తున్న మెగాస్టార్ ఈ సినిమా తనకెంత స్పెషలో చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. అయితే ఈ సినిమా జస్ట్ మెగాస్టార్ కే కాదు, ఈ సినిమాలో మోస్ట్ పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్న బిగ్ బి కి కూడా అంతే స్పెషల్. ప్రస్తుతం సైరా సినిమా సెట్స్ పై ఉన్న అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలోని మరో స్టిల్ ని తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

పొడవాటి గడ్డంతో గాంభీర్యం ఉట్టిపడేలా ఉన్న బిగ్ బి లుక్స్, ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లోను బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో అమితాబ్ ఇన్వాల్వ్ మెంట్ చూస్తుంటే, ఈ సినిమా జస్ట్ మెగాస్టార్ కే కాదు, బాలీవుడ్ మెగాస్టార్ కు కూడా అంతే స్పెషల్ అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అమితాబ్ ఎంట్రీతో, ట్విట్టర్ లో ఆయన పెట్టిన ఫొటోలతో సైరాకు ఇప్పుడు నేషనల్ అప్పీల్ వచ్చింది.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అమిత్ త్రివేదిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు.