తారకరత్న కోలుకుంటున్నారు -చిరు

Tuesday,January 31,2023 - 11:31 by Z_CLU

Chiranjeevi shares a updates on Tarakaratna’s health

ప్రస్తుతం టాలీవుడ్ లో తారకరత్న (Tarakaratna) హెల్త్ గురించే చర్చ నడుస్తుంది. పొలిటికల్ గా కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి హాట్ టాపిక్ గా మారింది. కుప్పంలో సృహ తప్పి పడిపోయిన తారకరత్నను హుటా హుటిన బెంగళూరులో ఓ హాస్పిటల్ లో తీసుకెళ్లారు. ప్రస్తుతం తారకరత్నకు అక్కడే ట్రీట్ మెంట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తమకి తెలిసిన సమాచారం అందిస్తూ తారకరత్న హెల్త్ గురించి అప్ డేట్ ఇస్తున్నారు సెలెబ్రిటీస్.

తాజాగా మెగా స్టార్ చిరంజీవి Chiranjeevi కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ట్వీట్ చేశారు. “సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. “ అంటూ చిరు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నందమూరి అభిమానులకు శుభ వార్త చెప్పారు.

 

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics