తండ్రి కాబోతున్న రామ్ చరణ్

Monday,December 12,2022 - 03:32 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన జంటకి త్వరలోనే బేబీ పుట్టనుంది. ఈ విషయాన్ని స్వయంగా మెగా స్టార్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. హనుమాన్ బ్లెస్సింగ్స్ తో రామ్ చరణ్ , ఉపాసన తల్లి దండ్రులు కాబోతున్నారని తెలియజేస్తూ తను తాత కాబోతున్న విషయాన్ని షేర్ చేసుకున్నారు చిరు. ఈ గుడ్ న్యూస్ తో మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం భార్య , కూతురు , మనవరాలుతో చిరు ఫ్రాన్స్ లో ఉన్నారు. అక్కడ ‘వాల్తేరు వీరయ్య’  సాంగ్ షూట్ జరుగుతుంది. అక్కడి నుండే ట్విట్టర్ , ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు చిరు.

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా పరిచయమైన రామ్ చరణ్ హీరోగా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా RRR తో ఇండియన్ సినిమా హిస్టరీలో తన పేరుని కూడా లిఖించుకున్నాడు. తండ్రిని మించే స్థాయికి చేరుకుంటున్నాడు. నటుడిగా చరణ్ ఇప్పటికే మగధీర , రంగస్థలం , RRR లతో రికార్డులు తిరగరాశాడు. కానీ చరణ్ విషయంలో మెగా ఫ్యామిలీ కి అలాగే ఫ్యాన్స్ కి ఓ లోటు ఉండిపోయింది. చరణ్ -ఉపాసనలు బేబీని ఎప్పుడు కంటారా ? అని ఎదురుచూశారు. ఫైనల్ గా చిరు చెప్పిన ఈ గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చరణ్ ఉపాసన చెప్పిన ఈ తీపి వార్తతో చిరు కూడా సంతోషంలో మునిగిపోయారు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics