Chiru Gundu - అసలు మేటర్ చెప్పిన మెగాస్టార్

Friday,September 25,2020 - 04:55 by Z_CLU

ఈమధ్య చిరంజీవి గుండు కొట్టించుకున్నారు. దానిపై రకరకాల ఎనాలసిస్ లు, గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఆ గుండు వెనక రీజన్స్ ను ఒక్కొక్కటిగా బయటపెడుతూ వచ్చారు మెగాస్టార్. ఎట్టకేలకు తను గుండు లుక్ ఎందుకు ట్రై చేశానో బయటపెట్టారు చిరు.

వేదాళం రీమేక్ లో సెకెండాఫ్ లో గుండుతో కనిపించబోతున్నారు మెగాస్టార్. ఆ సీన్ కోసం ఇప్పుడిలా గుండు లుక్ ట్రై చేశారు.

తను నిజంగా గుండు కొట్టించుకోలేదని, అదొక ప్రొస్తెటిక్ మేకప్ అనే విషయాన్ని బయటపెట్టిన Chiranjeevi.. ఇలా తన గుండు అసలు కథను వివరించారు.

ఈ మేటర్ తో మరో విషయం కూడా క్లియర్ అయింది. ఆచార్య తర్వాత చిరంజీవి.. Vedalam Remake (వేదాళం రీమేక్) నే సెట్స్ పైకి తీసుకురాబోతున్నారన్నమాట. దీని తర్వాత లూసిఫర్ రీమేక్ ఉంటుంది.