Chiranjeevi - గాడ్ ఫాదర్ క్లయిమాక్స్ వెనక అసలు కథ ఇదే

Wednesday,October 12,2022 - 02:47 by Z_CLU

Chiranjeevi Reveals the behind story of Godfather Movie climax

థియేటర్లలో సూపర్ హిట్టయింది గాడ్ ఫాదర్ సినిమా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రస్తుతం మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సక్సెస్ ను కొంతమంది మీడియావాళ్లతో పంచుకున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా సినిమా క్లయిమాక్స్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటో ఆయన మాటల్లోనే…

– ఫైనల్ కాపీ చూశాక కూడా చాలా మార్పులు చేశాం. ముఖ్యంగా ముందు షూట్ చేసిన క్లైమాక్స్ నాకు నచ్చలేదు. విలన్ అనుకున్న ఇంటర్నేషనల్ డాన్ వచ్చి బ్రహ్మ (చిరంజీవి)కు సలాం చేయడమేంటని సత్యదేవ్ పాత్ర అవాక్కవుతుంది.

– నీ భర్త నా ఎదురే ఉన్నాడు ఏం చేయమంటావమ్మా అని నయనతారతో అంటాను. ఈ తాళి ఉండకూడదన్నయ్యా అని ఆమె తెంపేయడం, నేను గన్ తీసుకుని సత్యదేవ్ క్యారెక్టర్ ను కాల్చేయడం ఒక వెర్షన్, అతనే గన్ తీసుకుని తనను తాను కాల్చుకోవడం… మరో వెర్షన్. ఇవన్నీ షూట్ చేశాం.

Chiranjeevi

– అప్పటికే సత్యదేవ్ పాత్ర జీవచ్ఛవంలా ఉంది. అలాంటి వాడ్ని ఇద్దరు సూపర్ స్టార్స్ చంపడం ఏంటని అనిపించింది. అది నాకస్సలు నచ్చలేదు. దర్శకుడితో ‘ఫినిషింగ్ నచ్చలేదు రాజా’ అన్నాను. వేట సినిమాలో నూతన్ ప్రసాద్ పాత్ర విషయంలో ఇాలాంటిదే జరిగింది.

– వేట సినిమాలో నూతనప్రసాద్ చాలా లోభి.. క్లైమాక్స్ లో అతని ముందు బంగారు నాణేలు విసిరి తిను తిను అంటాను. అది నాకు చాలా బ్యాడ్ ఎక్స్ పీరియన్స్. అందుకే గాడ్ ఫాదర్ క్లైమాక్స్ మార్చమని కోరాను.

– నయనతార కారులో రోడ్డు మీద వస్తుంటే కిల్ హర్ అంటాడు సత్యదేవ్. కానీ అది కూడా జరగదు. తన మామను చంపినట్టుగానే ఇన్ హేలర్ తో తననుతానే చంపుకునేలా మోహన్ రాజా చేసిన మార్పు మా అందరికీ బాగా నచ్చింది.

Chiranjeevi

ఇలా గాడ్ ఫాదర్ క్లయిమాక్స్ వెనక పడిన కష్టాన్ని వివరించారు చిరంజీవి. ఇలా ఎన్నో వెర్షన్లు షూట్ చేసిన తర్వాత, ఫైనల్ గా జనం చూసిన వెర్షన్ ను ఉంచామని, దానికి మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు మెగాస్టార్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, gossips, Actress Photos and Special topics