Acharya Temple Set - ఓ అద్భుతం

Thursday,January 07,2021 - 02:02 by Z_CLU

దేవాలయాల నేపథ్యంలో రాబోతోంది ఆచార్య (Acharya). మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం భారీ టెంపుల్ సెట్ వేశారు మేకర్స్. ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమా కోసం ఇంత పెద్ద టెంపుల్ టౌన్ సెట్ వేయలేదు.

chiranjeevi-acharya-temple-set 1 chiranjeevi-acharya-temple-set 1

ఆచార్య కోసం దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెట్ వేశారు. చూస్తే అచ్చంగా దేవాలయంలా అనిపించేలా, అద్భుతంగా తీర్చిదిద్దారు. మరీ ముఖ్యంగా గాలిగోపురం నిర్మాణం ది బెస్ట్. ఈ టెంపుల్ టౌన్ సెట్ విశేషాల్ని స్వయంగా చిరంజీవి బయటపెట్టారు.

chiranjeevi-acharya-temple-set 1 chiranjeevi-acharya-temple-set 1

ఈ అద్భుతమైన టెంపుల్ సెట్ ను ఆర్ట్ డైరక్టర్ సురేష్ నిర్మించాడు. దర్శకుడు కొరటాల ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ సెట్ కు సినిమాలో కీలక పాత్ర ఉంది. మరీముఖ్యంగా ఆచార్య సెకెండాఫ్ లో ఈ టెంపుల్ టౌన్ సెట్ ఎక్కువగా కనిపిస్తుందని టాక్.

chiranjeevi-acharya-temple-set 1 chiranjeevi-acharya-temple-set 1

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రామ్ చరణ్ పై షూట్ చేయాల్సిన పోర్షన్ మాత్రం పెండింగ్ లో ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

మూవీని దసరా కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.