Acharya Movie - క్రేజీ అప్ డేట్స్

Thursday,December 03,2020 - 06:28 by Z_CLU

లాంగ్ గ్యాప్ తర్వాత Chiranjeevi సెట్స్ పైకి వచ్చారు. కొరటాలశివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న Acharya మూవీని మళ్లీ స్టార్ట్ చేశారు. ఈరోజు చిరంజీవి రాకతో సెట్స్ లో పండగ వాతావరణం కనిపించింది.

ఆచార్య కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు. అది కూడా అలాంటిలాంటి సెట్ కాదు. ఏకంగా 16 ఎకరాల విస్తీర్ణంలో కేరళ గ్రామాన్ని తలపించే సెట్ అది. ఇందులోనే ఓ విలేజ్, టెంపుల్ కూడా ఉంటాయి.

ఈ భారీ సెట్ లోనే కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతోంది. ఈ ఒక్క సెట్ కోసమే దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సెట్ లో చిరంజీవిపై యాక్షన్ సీక్వెన్సెస్ తీస్తున్నారు.

మరో క్రేజీ అప్ డేట్ ఏంటంటే.. త్వరలోనే ఈ సెట్స్ పైకి రామ్ చరణ్ కూడా జాయిన్ అవుతున్నాడు. ఈ మేరకు రాజమౌళి నుంచి చరణ్ కు పర్మిషన్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం మహాబలిపురంలో RRR షూట్ లో ఉన్నాడు చెర్రీ. ఆ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే ఆచార్య సెట్స్ లో జాయిన్ అవుతాడు.

ఇక మరో అప్ డేట్ ఏంటంటే.. త్వరలోనే కాజల్ కూడా సెట్స్ పైకి రాబోతోంది. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ మాల్దీవుల్లో హనీమూన్ ముగించుకొని ముంబయి వచ్చింది. త్వరలోనే హైదరాబాద్ లో ల్యాండ్ అవుతోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ అన్నీ కంపోజ్ చేశాడు మణిశర్మ. కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయబోతున్నారు.