కరోనాను ఎదుర్కొనేందుకు మెగా ప్రయత్నం

Thursday,March 19,2020 - 03:23 by Z_CLU

కరోనా కారణంగా ఇప్పటికే తన సినిమా షూటింగ్ ను కాన్సిల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమం మొదలుపెట్టారు. కరోనాను ఎలా ఎదుర్కోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ.. ఓ వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి.

ఇప్పటికే కరోనాపై అవగాహన కల్పిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు చిరు. దీనికి అదనంగా ఇప్పుడు ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తన వంతుగా ఎవేర్ నెస్ వీడియోను రిలీజ్ చేశారు.