Sridevi Soda Center - ఫస్ట్ సింగిల్ అదిరింది

Friday,July 09,2021 - 01:04 by Z_CLU

శ్రీదేవి సోడా సెంటర్ హంగామా మొదలైంది. పక్కా మాస్ క్యారెక్టర్ లో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్టయింది.

https://www.instagram.com/p/CREUmMljO0E/

ఉత్తరాంధ్రకు చెందిన పాపులర్ ఫోక్ సాంగ్స్ లైన్స్ తీసుకొని ‘మందులోడా’ అనే ఈ లిరికల్ ను క్యాచీగా కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ. ఈ పాటకు సుధీర్ బాబు వేసిన స్టెప్పులు హైలెట్ గా నిలిచాయి. మంచి జోష్ తో సాగే ఈ సాంగ్ రాబోయే రోజుల్లో యూట్యూబ్ ను ఊపడం గ్యారెంటీ. సాహితి, ధనుంజయ్ ఈ సాంగ్ పాడారు.

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో సుధీర్ బాబు కి ప్ర‌త్యేక‌త వుంది. ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ లాంటి హ‌ర్ర‌ర్ కామెడి చిత్రం తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రి కి ట్రెండ్ క్రియొట్ చేశారు. భ‌లేమంచి రోజు లాంటి విభిన్న‌మైన క‌థ‌నం తో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. న‌న్నుదోచుకుందువ‌టే, స‌మ్మొహ‌నం చిత్రాల‌ తో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ కూడా ఆక‌ట్టుకున్నారు. క‌థ‌ల విష‌యంలో కంగారు లేకుండా ప్రేక్ష‌కుల అభిరుచి కి త‌గ్గ‌ట్టుగా చిత్రాలు చేస్తూ వెల్ టాలెంటెడ్ హీరోగా సుధీర్‌బాబు త‌న కెరీర్ ని కొన‌సాగిస్తున్నారు. అదేవిధంగా ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న చిత్రం ఈ శ్రీదేవి సోడా సెంట‌ర్‌..

Sudheer Babu New movie titled Sridevi Soda Center

ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్ట‌య్యింది. విడుద‌లయ్యిన మెద‌టి లుక్ కి విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం తెలిసిందే. ఇక సుధీర్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్బంగా శ్రీదేవి సోడా సెంట‌ర్ చిత్రానికి సంబందించి గ్లింప్స్ విడుద‌ల చేశారు. అది కూడా సూపర్ హిట్టయింది.

Sridevi Soda Centre movie Sudheer Babu 2

ఈ చిత్రాన్ని భ‌లేమంచిరోజు, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హ్య‌ట్రిక్ చిత్రాలు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ లో నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప‌లాస చిత్రం ద్వారా బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics