Chiranjeevi recovered from corona, Starts Godfather Shooting
కరోనాతో కొన్ని రోజులుగా బాధపడుతున్న చిరంజీవి కోలుకున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ఎనౌన్స్ చేశారు. తను రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ యాక్షన్ లోకి దిగానంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
గత నెలలో కరోనా బారిన పడ్డారు చిరంజీవి. అప్పట్నుంచి హోం ఐసొలేషన్ లో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో మందులు తీసుకుంటూ, 10 రోజుల పాటు అందరికీ దూరంగా ఉండిపోయారు. తాజాగా మరోసారి నిర్వహించిన టెస్టుల్లో కరోనా నెగెటివ్ రావడంతో చిరంజీవి కాలు బయటపెట్టారు. ఏకంగా గాడ్ ఫాదర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ ఆన్ లొకేషన్ స్టిల్స్ కూడా షేర్ చేసి, ఫ్యాన్స్ లో జోష్ ను డబుల్ చేశారు చిరు.
ప్రస్తుతం చిరంజీవి చేతిలో గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో పాటు బాబి దర్శకత్వంలో చేయాల్సిన మూవీ ఇది. ఈ సినిమాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఎనౌన్స్ చేశారు. ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ సెట్స్ పైకి రాబోతున్నాయి.
మరోవైపు చిరంజీవి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఏప్రిల్ 29న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఓసారి ప్రమోషన్ స్టార్ట్ చేసి ఆపేశారు. త్వరలోనే తిరిగి ప్రచారం మొదలుపెట్టబోతున్నారు.
