Chiranjeevi 'Acharya' - మరో కొత్త రిలీజ్ డేట్

Tuesday,February 01,2022 - 08:42 by Z_CLU

Chiranjeevi RamCharan starrer ‘Acharya’ to release on April 29 in a grand way

మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది ఆచార్య.

చిత్ర నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివగారు రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఫిబ్రవరి రిలీజ్ కాకుండా వాయిదా వేశాం. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల చేయాలని అనుకున్నాం. అయితే మార్చి 25న మరో భారీ బడ్జెట్ పాన్ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌వుతుంది. భారీ అంచ‌నాలున్న రెండు భారీ చిత్రాలు ఇలా త‌క్కువ గ్యాప్‌లో విడుద‌ల కావ‌డం స‌రికాదనే భావ‌న‌తో ఆర్ఆర్ఆర్ నిర్మాత‌లు, మేము సినిమా రిలీజ్ డేట్స్ విష‌యంలో చ‌ర్చ‌లు జ‌రిపాం. సానుకూల వాతావరణంలో జరిగిన చర్చల కార‌ణంగా ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న రిలీజ్ అవుతుంది. అలాగే మా ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాం.”

ఇలా ఆచార్య విడుదల వాయిదా వెనక రీజన్ ను బయటపెట్టారు నిర్మాతలు. ఆచార్య సినిమా వాయిదా ప‌డ‌టం అనేది మెగా ఫ్యాన్స్‌కు నిరాశ క‌లిగించే అంశ‌మే అయినప్పటికీ.. ఈ వెయిటింగ్‌కు త‌గ్గ ఫ‌లితం గ్యారంటీగా ఉంటుంద‌ని అంటున్నారు నిర్మాతలు.

కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. మణిశర్మ సంగీతం అందించాడు. రెజీనా ఐటెంసాంగ్ లో నటించగా, మరో ప్రత్యేక గీతంలో సీనియర్ హీరోయిన్ సంగీత నర్తించింది.

acharya chiranjeevi ramcharan