Acharya Trailer గూస్ బంప్స్ కంటెంట్

Tuesday,April 12,2022 - 06:46 by Z_CLU

Chiranjeevi, Ram Charan’s ‘Acharya’ Trailer Review by Zee Cinemalu

మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘ఆచార్య’ సినిమా ట్రైలర్ రిలీజైంది. 2 నిమిషాల 34 సెకన్ల ట్రైలర్ కట్ తో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించారు చిరు , చరణ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ హంగామా చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తోంది.

” దివ్య వనమొక వైపు , తీర్థ జలమొక వైపు, నడుమ పాద ఘట్టం …. ఇక్కడందరూ సౌమ్యులు , పూజలు పునస్కారాలు చేసుకుంటూ కష్టలొచ్చినప్పుడు అమ్మోరు మీద భారం వేసి బిక్కు బిక్కుమని ఉంటామేమో అని పొరపడి ఉండొచ్చు, ఆపదోస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది” అంటూ రామ్ చరణ్ వాయిస్ తో ఊరిలో పూజలు జరిగే విజువల్స్ తో స్టార్టయిన ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్స్ చాలానే చూపించారు.

ముఖ్యంగా చిరు ఎంట్రీ షాట్ తో పాటు ” పాద ఘట్టం వాళ్ళ మీద కాలేస్తే ఆ కాలు తీసేయ్యలంట” అంటూ రౌడీని కొడుతూ మెగా స్టార్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక రామ్ చరణ్ డైలాగ్స్ చెప్తూ చేసే ఫైట్స్ తో కూడిన షాట్స్ , సోనూ సూద్ కి వార్నింగ్ ఇస్తూ చిరు “నేనోచ్చానని చెప్పాలనుకున్నా” అంటూ కూర్చొని వార్నింగ్ ఇచ్చే సీన్ , ఇలా  సినిమాలో ఉండే అదిరిపోయే కంటెంట్ అంతా క్రిస్ప్ గా ట్రైలర్ లో చూపించారు.

ట్రైలర్ చివర్లో నీకు సిద్ద తెలుసా ? అంటూ తనికెళ్ళ భరణి చిరుని అడగ్గానే ఆ తర్వాత చిరు , చరణ్ లతో వచ్చే ఫైట్ షాట్స్ , సాంగ్ లో ఇద్దరూ కలిసి వేసే స్టెప్స్ తో వచ్చే విజువల్స్ మెగా ఫ్యాన్స్ కి కనువిందు చేసేలా ఉన్నాయి.

ట్రైలర్ లో సురేష్ సెల్వ రాజన్ వేసిన భారీ సెట్స్ , తిరునవుక్కరుసు సినిమాటోగ్రఫీ , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి.ఓవరాల్ గా ‘ఆచార్య’ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్తూ రిలీజైన ట్రయిలర్ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటూ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది. మరి మెగా స్టార్ , మెగా పవర్ స్టార్ ఈ సినిమాతో భారీ వసూళ్ళు రాబట్టి రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తుంది.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics