రామ్ చరణ్ సెట్స్ లో చిరంజీవి

Friday,September 21,2018 - 12:48 by Z_CLU

ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా షూటింగ్ అజర్ బైజాన్ లో జరుగుతోంది. అటు చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. కానీ చిరంజీవి మాత్రం మొన్నటివరకు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇక జార్జియా వెళ్తారని అంతా అనుకుంటున్న టైమ్ లో అజర్ బైజాన్ లో ప్రత్యక్షమయ్యారు మెగాస్టార్.

అవును.. సైరా లొకేషన్ కంటే ముందు రామ్ చరణ్ సినిమా సెట్స్ లో ప్రత్యక్షమయ్యారు చిరంజీవి. బోయపాటి డైరక్షన్ లో చెర్రీ చేస్తున్న సినిమాను పరిశీలించారు. కొడుకు, కోడలితో సరదాగా గడిపారు. అలా ఒక రోజు గడిపిన తర్వాత జార్జియా వెళ్లారు చిరంజీవి.

అజర్ బైజన్ లో రామ్ చరణ్ పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అటు జార్జియాలో కూడా చిరంజీవిపై యాక్షన్ ఎపిసోడే ప్లాన్ చేశారు. రామ్ చరణ్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అటు చిరంజీవి సినిమాను సమ్మర్ కు ప్లాన్ చేస్తున్నారు.