Chiranjeevi - అదే మెరుపు, అదే ఉత్సాహం

Thursday,November 19,2020 - 05:01 by Z_CLU

సోషల్ మీడియా వేడెక్కిపోతోంది.. ఎక్కడ చూసినా చిరంజీవి.. చిరంజీవి.. చిరంజీవి.
మెగాస్టార్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నారు. తన కొత్త సినిమాతో కాదు, తన లేటెస్ట్ స్టిల్స్ తో.

chiranjeevi new look 1

అవును.. Chiranjeevi లేటెస్ట్ స్టిల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిరు న్యూ లుక్ చూసి అంతా వావ్ అంటున్నారు. షార్ట్ గ్యాప్ తర్వాత బయటకొచ్చిన MegaStar లో అదే ఎనర్జీ, అదే ఛార్మింగ్.

ఓ ఛాట్ షో కోసం చిరంజీవి ఇలా మోస్ట్ స్టయిలిష్ గా తయారయ్యారు. వైట్ కలర్ రౌండ్ నెక్ టీ-షర్ట్ పై గ్రే కలర్ కోట్ తో చిరంజీవి అలా నవ్వుతూ నడుస్తుంటే అందర్లో వైబ్రేషన్స్ మొదలయ్యాయి.

chiranjeevi new look 3

కరోనా సోకినట్టు తప్పుడు రిపోర్ట్ రావడంతో దాదాపు 5 రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయారు చిరు. ఆ తర్వాత టెస్టుల్లో కరోనా లేదని తేలడంతో ఇలా డబుల్ జోష్ తో బయటకొచ్చారు.

త్వరలోనే Acharya సినిమా సెట్స్ లో జాయిన్ అవుతారు మెగాస్టార్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేస్తారు.