చిరు న్యూ లుక్ అదుర్స్

Monday,August 05,2019 - 03:24 by Z_CLU

దాదాపు 24 గంటలుగా ఒకే ఒక్క ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే చిరంజీవి ఫొటో. కొరటాల శివ సినిమా కోసం రీసెంట్ గా చిరంజీవి మేకోవర్ అయిన విషయం తెలిసిందే. అలా కొత్తగా తయారైన మెగాస్టార్, ఓ హెల్త్ మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సైరా సినిమా కోసం కాస్త లావుగా కనిపించిన చిరంజీవి, కొరటాల సినిమా కోసం తగ్గాల్సి వచ్చింది. అందుకే వైజాగ్ వెళ్లి మరీ స్లిమ్ అయ్యారు చిరు. న్యూలుక్ లో చిరంజీవి యంగ్ గా కనిపిస్తున్నారు. ఫిజిక్ కూడా పెర్ ఫెక్ట్ గా ఉంది. కొరటాల శివ సినిమాకు మెగాస్టార్ ఆల్ మోస్ట్ రెడీ

ఈ నెలలోనే చిరు-కొరటాల సినిమా లాంఛ్ అవుతుంది. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. మధ్యలో 20 రోజులు సైరా ప్రమోషన్ కోసం గ్యాప్ తీసుకుంటారు. కొరటాల సినిమాలో చిరంజీవి డ్యూయర్ రోల్ లో కనిపిస్తారని టాక్.