చిరంజీవి కొత్త ఇల్లు చూస్తారా?

Friday,April 03,2020 - 12:44 by Z_CLU

దాదాపు ఏడాది కిందటే చిరంజీవి తన ఇల్లును కొత్తగా తయారుచేసుకున్నారు. ఆ ఇంట్లోనే తనతో పనిచేసిన 90లనాటి హీరోహీరోయిన్లకు ఆమధ్య గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారు. అప్పటి ఫొటోలతోనే చిరంజీవి తన ఇంటిని కొత్తగా రెనొవేట్ చేశారని, ఇంటిని మరింత కాస్ట్ లీగా మార్చారని అందరికీ తెలిసింది. ఇప్పుడు తన ఇంటి ఎక్స్ టీరియర్ ను పరిచయం చేశారు చిరంజీవి.

తాజాగా సోషల్ మీడియాలోకి ఎంటరైన చిరు.. తన ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ తో పాటు ఇంటి బయట వాతావరణాన్ని ఇలా ఓ చిన్న వీడియో తీసి వదిలారు. నిజానికి ఇది తన ఇంటిని చూపిద్దామని చిరంజీవి తీసిన వీడియో కాదు. లాక్ డౌన్ వల్ల హైదరాబాద్ లో కాలుష్యం తగ్గి, నగరం ప్రశాంతంగా తయారైందని చెప్పడం కోసం మెగాస్టార్ ఈ వీడియో తీశారు.

అయితే చిరు ఉద్దేశం కంటే.. అతడి ఇంటిపైనే జనాల దృష్టి ఎక్కువగా పడింది. ఆ ఖరీదైన భవనం చూసి జనాలు వావ్ అంటున్నారు. ముంబయికి చెందిన ఓ పెద్ద ఆర్కిటెక్ట్ కంపెనీ.. చిరంజీవి ఇంటిని ఇలా అందంగా తీర్చిదిద్దింది. కొన్నేళ్లుగా చిరంజీవి ఇక్కడే ఉంటున్నారు. కాకపోతే ఏడాది కిందట పూర్తిగా దీన్ని మార్చేశారు.