Chiranjeevi - మహేష్ దర్శకుడితో మెగాస్టార్?

Thursday,April 22,2021 - 04:43 by Z_CLU

ప్రస్తుతం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ సినిమాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో మెగాస్టార్ చిరు -వంశీ పైడిపల్లి కాంబో ఒకటి. అవును.. వంశీ పైడిపల్లి త్వరలోనే చిరుని డైరెక్ట్ చేయనున్నాడనేది ప్రస్తుతం హాట్ టాపిక్.

ఇటివలే మెగాస్టార్ కి ఓ మెగా స్క్రిప్ట్ చెప్పి వంశీ ఇంప్రెస్ చేశాడని, కథ నచ్చడంతో చిరు వెంటనే ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. మహర్షి తర్వాత ఇంత వరకూ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ చేసుకోలేదు వంశీ. మహేష్ తోనే మళ్ళీ సినిమా చేస్తాడనుకుంటే ఆ ప్రాజెక్ట్ పై ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఇక రామ్ చరణ్ తో వంశీ సినిమా అని వార్తలోచ్చినప్పటికీ, చరణ్ శంకర్ సినిమా ఎనౌన్స్ మెంట్ ఆ ప్రాజెక్టు కూడా సైడ్ అయింది.

Vamsi-Paidipalli

అందుకే వంశీ ఓ మంచి కథతో మెగాస్టార్ ని ఒప్పించి త్వరలోనే ఆయనతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇక మహర్షిలో రైతు ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా వీకెండ్ ఫార్మింగ్ అంటూ వంశీ మంచి ఎలిమెంట్ రైజ్ చేశాడు. తాజాగా ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా లభించింది. అందుకే చిరు వంశీ చెప్పిన స్క్రిప్ట్ పై నమ్మకంగా ఉన్నారని ఈ కాంబోలో సినిమా త్వరలోనే ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం కొరటాల శివ తో ‘ఆచార్య’ చేస్తున్న మెగాస్టార్ ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ ని పట్టాలెక్కించనున్నారు. ఆ తర్వాత మెహర్ రమేష్, బాబీ సినిమాలు చేయాల్సి ఉంది. మరి చిరు వీటి గ్యాప్ లో వంశీతో సినిమా చేస్తారా ? లేదా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక సినిమా చేస్తారా ? చూడాలి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics