Lucifer Remake పై క్లారిటీ వచ్చేదెప్పుడు?

Monday,August 10,2020 - 01:14 by Z_CLU

మెగాస్టార్ Chiranjeevi నటించబోయే #LuciferRemake పై రోజుకో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తాడని, ప్రస్తుతం తను కథలో మార్పులు చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు చిరు. కానీ ఇప్పుడీ సినిమా సుజీత్ చేతిలో నుండి స్టార్ డైరెక్టర్ వినాయక్ చేతిలోకి వెళ్ళిందనే ప్రచారం జరుగుతుంది. ఈ రీమేక్ ప్రాజెక్ట్ ను వినాయక్ డైరెక్ట్ చేయడం పక్కా అన్నట్టుగా మెగా కాంపౌండ్ నుండి కూడా ఫీలర్స్ వస్తున్నాయి.

అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే ‘Acharya’ షూటింగ్ ఈపాటికే పూర్తయి ఉండేది. వెంటనే లూసిఫర్ కూడా సెట్స్ పైకి వెళ్ళేది. కానీ కరోన ఎఫెక్ట్ తో ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. ఇక ఆగస్ట్ 22 న చిరు పుట్టినరోజున ఈ రీమేక్ పై అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు.

సో ఫైనల్ గా Lucifer Remake ను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది తెలియాలంటే అనౌన్స్ మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.