మెగాభిమానులకు "మాస్టర్" కానుక

Wednesday,October 03,2018 - 03:15 by Z_CLU

150 సినిమాల కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు మెగాస్టార్ చిరంజీవి. వాటిలో ఎన్నో మాస్ పాత్రలున్నాయి. ఇంకొన్ని క్లాస్ పాత్రలున్నాయి. అయితే ఒకే సినిమాలో అటు మాస్, ఇటు క్లాస్ టచ్ రెండూ మిక్స్ చేస్తూ చిరు చేసిన సినిమాలు కొన్నే. రౌడీ అల్లుడు లాంటి అలాంటి ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే కోవలోకి వస్తుంది మాస్టర్ మూవీ. ఈ రోజుతో ఈ సినిమా విడుదలైన సరిగ్గా 21 ఏళ్లు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ స్టూడెంట్ లా, క్లాస్ లెక్చరర్ గా మెరుపులు మెరిపించాడు చిరంజీవి. అక్టోబర్ 3, 1997న వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ది సూపర్  హిట్స్ గా నిలిచింది.

షార్ట్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ అందుకున్న రెండో సక్సెస్ ఇది. రిక్షావోడు తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న చిరంజీవి, హిట్లర్ సినిమాతో మళ్లీ తెరపైకొచ్చారు. ఆ సినిమా సక్సెస్ ను మాస్టర్ మూవీ కంటిన్యూ చేసింది. ఇక మాస్టర్ నుంచి చిరంజీవికి మళ్లీ వెనక్కితిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అందుకే మెగాస్టార్ కు మాస్టర్ అంటే అంతిష్టం. దేవా సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలన్నీ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అంతేకాదు, చిరంజీవి ఇందులో ఓ పాట కూడా పాడారు.