సెట్స్ పైకొచ్చిన మెగాస్టార్

Thursday,January 02,2020 - 01:12 by Z_CLU

చిరంజీవి కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కోకాపేటలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిరంజీవిపై ఇవాళ్టి నుంచి కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు ఉంటుంది.

ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా చిరంజీవిపై కొన్ని సన్నివేశాలతో పాటు.. ఓ సాంగ్ ను కూడా షూట్ చేయాలనుకుంటున్నారు. రీసెంట్ గా ఈ మూవీ కోసం మణిశర్మ ఓ ఐటెంసాంగ్ కంపోజ్ చేశాడు. రికార్డింగ్ కూడా పూర్తయింది. కుదిరితే ఆ పాటనే కంప్లీట్ చేస్తారు. ఇందులో రెజీనా మెరవనుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారు. ఆమె ఇంకా సెట్స్ పైకి రాలేదు. సెకెండ్ షెడ్యూల్ నుంచి త్రిష-చిరంజీవి కాంబోలో సీన్స్ ఉంటాయి. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గారు. రీసెంట్ గా అన్నపూర్ణ స్టుడియోస్ లో లుక్ టెస్ట్ కూడా పూర్తయింది.

కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో చరణ్ ఓ కీలక పాత్రలో కూడా కనిపించబోతున్నాడు. సినిమాను ఆగస్ట్ 14న థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.