జనవరి 2 నుంచి చిరు-కొరటాల సినిమా

Friday,December 27,2019 - 11:02 by Z_CLU

లెక్కప్రకారం ఈపాటికే చిరంజీవి-కొరటాల సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ చిరంజీవి గెటప్ ఇంకా ఫిక్స్ కాకపోవడంతో సినిమా షూటింగ్ వాయిదాపడుతూ వస్తోంది. అయితే ఇకపై ఎలాంటి పోస్ట్ పోన్స్ ఉండవు. ఎందుకంటే, చిరంజీవి గెటప్ ఫిక్స్ అయింది.

సినిమాలో చిరు లుక్ ఎలా ఉండాలనే అంశంపై యూనిట్ అంతా ఒక నిర్ణయానికొచ్చారు. అన్నపూర్ణ స్టుడియోలో చేసిన లుక్ టెస్ట్ లో ఈ మేరకు చిరంజీవి గెటప్ ను లాక్ చేశారు. అక్కడే ఓ చిన్న ఫొటో షూట్ కూడా నిర్వహించారు. ఆ స్టిల్స్ ను త్వరలోనే మీడియాకు రిలీజ్ చేయబోతున్నారు.

లుక్ ఫిక్స్ అవ్వడంతో వెంటనే రెగ్యులర్ షూటింగ్ డేట్ లాక్ చేశారు. జనవరి 2 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఈ మేరకు కోకాపేటలో ఇంటి సెట్ నిర్మించారు. మూవీకి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. త్రిష ఇందులో హీరోయిన్.