చిరు - కొరటాల సినిమా.. అనౌన్స్ మెంట్ అప్పుడే

Sunday,October 07,2018 - 12:40 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబోలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను విజయదశమి రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ సినిమాలో చిరు డ్యుయల్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం.. ఈ సినిమాలో మెగా స్టార్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించే చాన్స్ ఉంది.

కొణిదెల ప్రొడక్షన్ కంపెని & మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి రానుందని టాక్.