కాజల్ కు బంపర్ ఆఫర్..?

Tuesday,October 25,2016 - 03:21 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి సరసన 150వ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన కాజల్… మరో బంపర్ ఆఫర్ అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. తన అల్టిమేట్ పర్ఫార్మెన్స్ తో మెగాస్టార్ దగ్గర మార్కులు కొట్టేసిన కాజల్.. చిరంజీవి నెక్ట్స్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతోందట. అవును… తన 151వ సినిమాలో కూడా కాజల్ నే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట చిరంజీవి.

www.tkada.com

ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో చిరంజీవి తప్ప మరే హీరో కాజల్ కు ఛాన్స్ ఇచ్చే పొజిషన్ లో లేరు. రామ్ చరణ్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సెట్స్ పైకి వచ్చేలా ఉన్నా, చిరంజీవి సరసన నటించిన కాజల్ ను మళ్లీ తన సినిమాల్లోకి తీసుకుంటాడని ఎవరూ ఊహించరు. అటు బన్నీ కూడా తన కొత్త సినిమాలో హీరోయిన్ ను ఆల్రెడీ ఫిక్స్ చేసేశాడు. ఇలాంటి టైమ్ లో మెగాస్టారే మరోసారి ఛాన్స్ ఇవ్వాలని అనుకోవడం నిజంగా కాజల్ అదృష్టమనే చెప్పాలి. చిరు 151వ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశం ఉంది.