లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి?

Tuesday,October 01,2019 - 01:21 by Z_CLU

లూసిఫర్.. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా అదే పేరుతో తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పుడీ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేయబోతున్నారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ పుకార్లు రావడానికి కారణం, ఈ రీమేక్ రైట్స్ ను మెగా కాంపౌండ్ దక్కించుకోవడమే.

అవును.. లూసిఫర్ రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ దక్కించుకున్నాడు. మెగాస్టార్ కోసమే చరణ్ ఈ రీమేక్ రైట్స్ తీసుకొని ఉంటాడంటూ గాసిప్స్ వస్తున్నాయి. రైట్స్ తీసుకున్న మాట మాత్రం వాస్తవం. స్వయంగా ఈ సినిమాను డైరక్ట్ చేసిన పృధ్వీరాజ్ ఈ విషయాన్ని బయటపెట్టాడు.

ప్రస్తుతం సైరా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు చిరు. ఈ మూవీ తర్వాత కొరటాల దర్శకత్వంలో సినిమా ఉంటుంది. దీంతో పాటు లైన్లో త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది. సో.. లూసిఫర్ రీమేక్ ఇంత త్వరగా సెట్స్ పైకి వస్తుందని ఎక్స్ పెక్ట్ చేయలేం. అయితే మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వచ్చినప్పటికీ అందులో హీరో మాత్రం చిరంజీవి అనేది ఫిక్స్. ఎందుకంటే లూసిఫర్ లో మోహన్ లాల్ చేసిన పాత్ర అలాంటిది.