సోషల్ మీడియాలో అడుగుపెట్టిన మెగాస్టార్

Wednesday,March 25,2020 - 12:46 by Z_CLU

ప్రస్తుతం స్టార్ హీరోలు , హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు కొన్ని సమస్యల మీద తమ అభిప్రాయం తెలియజేస్తూ ఉంటారు. మరికొందరు తమ సినిమా అప్డేట్స్ అభిమానులకు అందిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారు. అందులో మెగాస్టార్ ఒకరు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా కీ రోల్ పోషిస్తుండటంతో తాజాగా చిరు కూడా ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి అభిమానుల చేత ఘనస్వాగతం అందుకున్నారు.

ఎట్టకేలకు మెగాస్టార్ ట్విట్టర్ లో మెగా ఎంట్రీ ఇవ్వడంతో సెలెబ్రిటీస్ కూడా గ్రాండ్ గా వెల్ కం చెప్పి చిరంజీవి ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తున్నారు.

నిన్న ఇనస్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసిన చిరు నేడు ట్విట్టర్ లో అకౌంట్ ప్రారంభించి అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అత్యంత ప్రియమైన అభిమానులందరితో ఈ వేదిక ద్వారా నేరుగా మాట్లాడటం ఆనందంగా ఉందంటూ చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరం ఇంటి పట్టునే ఉందాం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇకపై ఈ వేదిక ద్వారానే చిరు తన సందేశాలతో పాటు మూవీ అప్ డేట్స్ అందిస్తారు.