మెగాస్టార్ పోస్ట్ చేసిన మొట్టమొదటి ఫొటో

Wednesday,March 25,2020 - 06:31 by Z_CLU

ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంటరయ్యారు చిరంజీవి. చిరు రాకతో సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి పండగ వాతావరణం నెలకొంది. ఉదయాన్నే 11 గంటల 11 నిమిషాలకు ట్విట్టర్ లో ప్రవేశించిన మెగాస్టార్.. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇనస్టాగ్రామ్ లోకి కూడా ఎంటరయ్యారు.

ఇనస్టాగ్రామ్ లో ఖాతా తెరిచిన మెగాస్టార్.. తన తల్లితో సెల్ఫీ దిగి ఆ ఫొటోను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో చిరంజీవి అధికారికంగా పోస్ట్ చేసిన మొట్టమొదటి ఫొటో ఇదే. హోమ్ టైమ్.. మామ్ టైమ్ అంటూ చిరంజీవి పెట్టిన కామెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

చిరంజీవి పోస్ట్ చేసిన ఈ సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అవగాహన-బాధ్యతతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు చిరు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, పెద్దవాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.