Godfather - స్పెషల్ సాంగ్ షూట్ పూర్తిచేసిన మెగాస్టార్

Monday,August 01,2022 - 04:05 by Z_CLU

Chiranjeevi completes Special song shoot with Salman

ప్రస్తుతం చిరంజీవి ముంబయిలో ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి-సల్మాన్ కాంబినేషన్ లో ముంబయిలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇప్పుడీ షెడ్యూల్ పూర్తయింది. సాంగ్ షూట్ కంప్లీట్ అయింది. సాంగ్ అద్భుతంగా వచ్చిదంటోంది యూనిట్.

మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి. మలయాళంలో హిట్టయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ ఇది. ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు సల్మాన్ ఖాన్. సినిమాలో సల్మాన్-చిరుపై ఓ సాంగ్ కూడా పిక్చరైజ్ చేశారు. దీని కోసం ముంబయిలో ప్రత్యేకంగా సెట్ వేశారు. ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఈ సాంగ్ షూట్ పూర్తయింది.

నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో తెరకెక్కుతోంది గాడ్ ఫాదర్ సినిమా. సినిమాకు సంబంధించి దాదాపు 80శాతం షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

లూసిఫర్ లో మోహన్ లాల్ పోషించిన పాత్రను తెలుగు రీమక్ లో చిరంజీవి పోషిస్తున్నాడు. ఇక మలయాళం వెర్షన్ లో పృధ్వీరాజ్ పోషించిన పాత్రను, తెలుగులో సల్మాన్ ఖాన్ పోషిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.