చిరంజీవి-బోయపాటి సినిమా రెడీ

Monday,May 15,2017 - 03:46 by Z_CLU

ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా పనిమీద బిజీగా ఉన్నారు చిరంజీవి. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ఉంటుంది. అయితే ఉయ్యాలవాడ సినిమా ఇంకా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంటుండగానే బోయపాటి సినిమా రెడీ అయిపోయింది. ఈ విషయాన్ని నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించారు.

చిరంజీవి-బోయపాటి ప్రాజెక్టుకు ఇతనే నిర్మాత. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే స్టోరీ రెడీ అయిపోయిందని ప్రకటించారు అల్లు అరవింద్. చిరంజీవి కోసం అదిరిపోయే మాస్ యాక్షన్ స్టోరీని బోయపాటి సిద్ధంచేశారని.. ఇప్పటివరకు కెరీర్ లో చిరంజీవి ఇలాంటి పాత్ర చేయలేదని అల్లు అరవింద్ ప్రకటించారు. అరవింద్ ప్రకటనతో చిరు-బోయపాటి కాంబోపై అంచనాలు డబుల్ అయిపోయాయి.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాపైనే ఫోకస్ పెట్టారు చిరంజీవి.  ఈ మూవీ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే బోయపాటి సినిమా స్టార్ట్ చేస్తారు మెగాస్టార్.