Chiranjeevi Bobby Movie - మొదలైన మెగాస్టార్ సినిమా

Saturday,November 06,2021 - 06:17 by Z_CLU

Chiranjeevi Bobby Mega 154 Movie Pooja Muhurtham Held

మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న MEGA154 సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రారంభ వేడుకకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు , వీవీ వినాయక్ , పూరి జగన్నాథ్ , కొరటాల శివ ,హరీష్ శంకర్ పాల్గొన్నారు. పూరి జగన్నాథ్ కెమెరా స్విచ్చాన్ చేయగా , వినాయక్ క్లాప్ ఇచ్చారు. రాఘవేంద్ర రావు మొదటి షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు.

chiranjeevi Bobby Movie Launch

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం భారీ సెట్ వర్క్ జరుగుతుంది. ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్స్ తో పూనకాలే అంటూ మాస్ ఆడియన్స్ ని ,మెగా ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న దర్శకుడు బాబీ ఈ సినిమాతో చిరు ని సరికొత్త మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేయాలని చూస్తున్నాడు. ఇందుకోసం మంచి మాస్ కథ రాసుకొని అదిరిపోయే క్యారెక్టరైజేషణ్ డిజైన్ చేసాడట బాబీ. ప్రీ లుక్ పోస్టర్స్ లో చిరు లుక్ చూసి ముఠా మేస్త్రీ గెటప్ గుర్తుచేసుకుంటూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్.

chiranjeevi Bobby Movie Launch

మెగా స్టార్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అలాగే మిగతా క్యారెక్టర్స్ కి కూడా యాక్టర్స్ ని ఎంపిక చేసే ప్రాసెస్ లో ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఓపెనింగ్ రోజే అరాచకం ఆరంభం అంటూ పోస్టర్ పై వేయడంతో ఈ ప్రాజెక్ట్ పై మేకర్స్ ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతుంది. బాబీ కథకి కోనా వెంకట్ – చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

chiranjeevi Bobby Movie Launch

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics