Chiranjeevi Balakrishna - అసలు సంగతి చెప్పేదెప్పుడు?

Friday,August 06,2021 - 04:46 by Z_CLU

టాలీవుడ్ బడా సినిమాలన్నీ ఒకటి తర్వాత మరొకటి రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటూ ఇప్పటి నుండే బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే చిరు ‘ఆచార్య, బాలయ్య ‘అఖండ’ మాత్రం ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. దీంతో ఈ ఇద్దరు తమ సినిమాలతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చే తరుణం కోసమా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉన్నాయి. ‘అఖండ’ ఫైనల్ షెడ్యుల్ చెన్నై లో జరుగుతుంది. ‘ఆచార్య’ ఇటివలే టాకీ పూర్తి చేసుకుంది. రెండు సాంగ్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి.

‘అఖండ’ సెప్టెంబర్ సెప్టెంబర్ లో వినాయక చవితి స్పెషల్ రానుందని మొన్నటి వరకూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా అక్టోబర్ లో దసరా రిలీజ్ అంటూ టాక్ వినబడుతుంది. ఇక మొన్నటి వరకు ‘ఆచార్య’ సినిమా అక్టోబర్ లో రానుందని వినిపించగా… ఇప్పుడు వచ్చే సంక్రాంతి బరిలో నిలవనుందనే ప్రచారం మొదలైంది. వచ్చే ఏడాది జనవరి 7న సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

అక్టోబర్ లో RRR రిలీజ్ పక్కా అంటూ తాజాగా మేకింగ్ వీడియో మరోసారి ప్రకటించారు మేకర్స్. ఇక రాజమౌళి చెప్పిన టైంకే సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తే అఖండ వెనక్కి వెళ్ళడం ఖాయం. ఒకవేళ RRR ఆలస్యం అయితే మాత్రం ఆ డేట్ కి బాలయ్య సినిమా వచ్చే అవకాశం ఉంది. ఇక వచ్చే సంక్రాంతికి ఇప్పటికే నాలుగు సినిమా ఎనౌన్స్ అయ్యాయి. మరి మెగా స్టార్ కూడా ఆ పోటీ లో ఆచార్య తో నిలుస్తాడా ? లేదా అక్టోబర్ , నవంబర్ లోనే థియేటర్స్ లోకి వచ్చేస్తాడా ? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ రెండు సినిమాల రిలీజ్ ప్రకటన కోసం మెగా ఫ్యాన్స్ , నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics