Chiranjeevi Prakash Raj - నందాను మెచ్చుకున్న చిరు

Monday,April 12,2021 - 05:36 by Z_CLU

వకీల్ సాబ్ సినిమాలో లాయర్ నందాగా కనిపించాడు ప్రకాష్ రాజ్. సినిమా సెకెండాఫ్ లో పవన్ కల్యాణ్ తో పోటీపడి నటించారు. సెకెండాఫ్ లో ఎక్కువగా పవన్-ప్రకాష్ రాజ్ మాత్రమే కనిపించారు. వకీల్ సాబ్ లో ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ కు మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. ప్రకాష్ రాజ్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

“ప్రకాష్ రాజ్ లాంటి క్యాలిబర్ ఉన్న నటుడు ఉంటే, ఎదురుగా ఉన్న నటుడిలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. వకీల్ సాబ్ లో ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. పవన్ కల్యాణ్ తో పోటాపోటీగా నటించారు. నీకు స్పెషల్ కాంగ్రాట్స్ ప్రకాష్ రాజ్”

chiranjeevi prakash raj vakeelsaab 2

ఇలా ప్రకాష్ రాజ్ ను ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. అంతేకాదు.. ప్రకాష్ రాజ్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ బొకే కూడా ఇచ్చారు. ఆ ఫొటోను కూడా షేర్ చేశారు.

ప్రకాష్ రాజ్ పై చిరంజీవి ఎలా రియాక్ట్ అయ్యారో, పవన్ కల్యాణ్ కూడా దాదాపు అలానే రియాక్ట్ అయ్యారు. వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఎదురుగా ఉంటే మన నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ వస్తుందన్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా దాదాపు అలానే స్పందించారు.

కెరీర్ స్టార్టింగ్ లో ప్రకాష్ రాజ్ తో కలిసి బద్రి అనే సినిమా చేశాడు పవన్ కల్యాణ్. ఆ సినిమాలో బద్రిగా పవన్ కల్యాణ్ నటిస్తే, నందాగా ప్రకాష్ రాజ్ కనిపించాడు. వాళ్లిద్దరి పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ కల్యాణ్-ప్రకాష్ రాజ్ పోటాపోటీగా నటించే సినిమా వచ్చింది. అదే వకీల్ సాబ్. అందుకే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన లాయర్ పాత్రకు నందా అనే పేరు పెట్టాడు దర్శకుడు వేణుశ్రీరామ్.

ఇక చిరంజీవి-ప్రకాష్ రాజ్ అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్లిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. చిరంజీవి అంటే ప్రకాష్ రాజ్ కు ఎప్పట్నుంచో ప్రత్యేక అభిమానం. తన సినిమాల్లో ఓ మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంటే దానికి ప్రకాష్ రాజ్ ను తీసుకోమని చిరంజీవి స్వయంగా దర్శకుడికి చెప్పిన సందర్భాలున్నాయి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics