'గద్దలకొండ గణేష్'ని అభినందించిన మెగాస్టార్

Tuesday,September 24,2019 - 05:51 by Z_CLU

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ‘గద్దలకొండగణేష్‌’ సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మంచి కలెక్షన్స్‌ తో దూసుకెళ్తోంది.

ఈ రోజు (సెప్టెంబర్ 24) ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి వరుణ్ పెర్ఫార్మన్స్ చాలా బాగుందని. హరీష్ శంకర్ చాలా బాగా తీశాడని, డైలాగ్స్ చాలా బాగున్నాయని అన్నారు . ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మాతలు ఈ చిత్రాన్నితీశారని, సినిమాలో టీం స్పిరిట్ కనిపిస్తోందని ప్రశంసిస్తూ ఈ అద్భుత విజయాన్ని సాధించిన టీం అందరికీ విజయాభినందనలు తెలిపారు.