Acharya ఇది మెగాస్టార్ మూవీ

Tuesday,April 26,2022 - 03:12 by Z_CLU

Chiranjeevi and Ram Charan Speech at ‘Acharya’ Press Meet

మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆచార్య‘ ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజవుతుంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు.

ఇందులో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ” ‘ఆచార్య’ ఇది మెగా స్టార్ మూవీ. ఇందులో నేను కేవలం ఒక భాగం మాత్రమే. నాన్నతో ఓ ఇరవై రోజులు కలిసి టైం స్పెండ్ చేస్తూ ఆయన నుండి కొన్ని విషయాలు నేర్చుకునేందుకు ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది. ” అన్నాడు.

ఇక మెగా స్టార్ చిరు మాట్లాడుతూ ” నిజమే చరణ్ ది కథలో ఓ భాగమైన పాత్ర. కానీ రేపు సినిమా చూశాక ఆ కేరెక్టర్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కచ్చితంగా చరణ్ గురించి మాట్లాడుకునేలా ఉంటుంది. ” అన్నారు. ఇక షూటింగ్ నాతో ఉండటం కోసం ఇంకెవర్నీ షూటింగ్ కి  రానివ్వలేదు చరణ్. ముఖ్యంగా వాళ్ళ అమ్మ సురేఖని కూడా సెట్స్ కి రానివ్వకుండా చేశాడు. ఇద్దరం కలిసి నటించడం, ఒకే రూమ్  స్టూడెంట్స్ లా షేర్ చేసుకుంటూ కలిసే ఉండటం ఎప్పటికీ మర్చిపోలేని బెస్ట్ మూమెంట్స్. వాటన్నిటిని కెమెరాలో బంధించుకున్నాం. మేమిద్దరం కలిసి నటించే ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పటికి వస్తుందో..? మళ్ళీ శివనే ఇలాంటి కథ తీసుకురావలేమో అనిపిస్తుంది. ఇక రామ్ చరణ్ నటన గురించి చెప్పాలంటే ఇందులో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి.  గ్లిసరిన్ వాడకుండా చరణ్ నాకు కన్నీళ్ళు తెప్పించేలా నటించాడు. మన రియాక్షన్ ఎప్పుడూ ఎదుటి వారి యాక్టింగ్ ని బట్టే ఉంటుంది. చరణ్ నటుడిగా ఎంతో ఎదిగాడని అర్థమైన క్షణమది ” అన్నారు.

నిన్నటి నుండి ‘ఆచార్య‘ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా మెగా మానియా కనబడుతుంది. మెగా స్టార్ , మెగా పవర్ స్టార్ ని ఒకే స్క్రీన్ పై రెండు పవర్ ఫుల్ కేరెక్టర్స్ లో చూసేందుకు మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అందరూ ఎగ్జటింగ్ వెయిట్ చేస్తున్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics