రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'చిలసౌ'

Tuesday,July 10,2018 - 11:36 by Z_CLU

యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరక్కించిన ‘చి ల సౌ’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సుశాంత్ -రుహాని శర్మ జంటగా రూపొందిన ఈ సినిమా జులై 27 న విడుదల కాబోతుంది. ఈ  విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్ పై యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.